ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు
ADANI NDTV DEAL: భారత బడా బిలియనీర్ గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.దేశంలోని టాప్ ఛానెళ్లలో ఒకటైన ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతుందని తెలుస్తోంది.అదానీ, ఎన్జీటీవీ డీల్ విషయంలోన తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్.
ADANI NDTV DEAL: భారత బడా బిలియనీర్ గౌతం అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దేశంలోని టాప్ ఛానెళ్లలో ఒకటైన ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా కొనుగోలు చేసింది అదానీ గ్రూప్. మరో 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలుకు ప్రయత్వాలు చేస్తోందని సమాచారం. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ ఏఎంఎన్ఎల్ ఈ వాటా కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయబోతుందన్న వార్త జాతీయ స్థాయిలో హాట్ హాట్ గా మారింది. ఇప్పటివరకు బీజేపీకి అనుకూలంగా లేని మీడియా సంస్థగా ఎన్డీటీవీకి పేరుంది.
సోషల్ మీడియా వేదికపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో ముందుండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. అదానీ, ఎన్జీటీవీ డీల్ విషయంలోన తనదైన శైలిలో స్పందించారు. మోడీ లక్ష్యంగా ట్వీట్ చేశారు. దేశంలో మీడియా మోడియాగా మారుపోతుందంటూ సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్. " రిప్ ఇండిపెండెంట్ మీడియా లేదా మనం ఇప్పుడు దానిని మోడియా అని పిలవాలి.. దేశంలో పూర్తి సమాచార శూన్యతను స్పష్టించడానికి మరియు భారత దేశాన్ని ఏకీకృత రాష్ట్రంగా అమలు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి