CM Kcr: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలని పిలుపునిచ్చారు. బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్ కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ వ్యతిరేకత శక్తులన్నీ ఏకం కావాలన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని..చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నారు. దేశంలో అభివృద్ధి జరగాల్సి ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనే దానిపై తొందర ఎందుకని..విస్తృతంగా చర్చ జరిగాక నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒకే తాటిపై ఉన్నామని తెలిపారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులను అన్నీ అమ్మేస్తున్నారని..ఇలాగే చేస్తే ఏం మిగులుతుందని ప్రశ్నించారు. బేచో ఇండియా అనేదే వాళ్ల పాలసీ అని మండిపడ్డారు. అమెరికా ఎన్నికల్లో మోదీ వేలు పెట్టాల్సిన అవసరమెందుకన్నారు.


విద్యుత్ చట్టం తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. భూములను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన గల్వాన్ ఘర్షణలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాదు. ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. 


అనంతరం బీహార్ సీఎం నితిష్‌కుమార్‌తో మంతనాలు జరిపారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. భేటీలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. 40 నిమిషాలకు పైగా జరిగిన భేటీలో జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.


ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరుకు వెళ్లి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పోటీలో ఉండాలని ఆయన భావిస్తున్నారు. పార్టీని సైతం ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ పేరు ఖరారు అయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మరిన్ని పర్యటనలు ఉండనున్నాయి.


Also read:ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల..అత్యుత్తమ స్థానానికి చేరిన హార్దిక్ పాండ్యా..!


Also read:CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..నితీష్‌ కుమార్‌తో కీలక మంతనాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి