బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లో గురువారం ఉదయం 11 గంటలకు భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు జిల్లా ఎస్పీ మోహిత్ గర్గ్ పీటీఐకి తెలిపారు. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బైరామల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తోన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలకు మావోయిస్టులు తారసపడిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ఘటనాస్థలంలో 10 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు 11 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. 


ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉండగా మరోవైపు ఎన్‌కౌంటర్ స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.