Jammu Encounter:  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేల జమ్మూ కశ్మీర్ లో అలజడి నెలకొండి. జమ్మూకాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ లో  ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు వీరమరణం చెందారు. గురువారం తెల్లవారు జామున అనుమానాస్పద ఆత్మాహుతి బృందం రాజౌరి జిల్లా దర్హాల్‌‌లో ఉన్న ఆర్మీ క్యాంపు దగ్గరకు వచ్చింది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించిన ఆర్మీ నిఘా బృందం వెంటనే అప్రమత్తమైంది. ఉగ్రవాదుల అడ్డుకునేందుకు ప్రయత్నించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదలను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. కాసేపటికి ఆ ప్రాంతాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకితీసుకుంది.మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం ముమ్మర తనిఖీలు చేస్తోంది. రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఆత్మహుతి దాడి జరిగింది. బేస్ ఆపరేటింగ్ ఆర్మీకి చెందిన కంపెనీపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. కాల్పుల్లో ఐదుగురు జవాన్లకు గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సైనిక సిబ్బందిలో ఒక అధికారి కూడా ఉన్నారు.ఆత్మహుతి దాడి వెనుక వెనక లష్కరే తోయిబా హస్తం ఉందని ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి.



కొందరు  ఉగ్రవాదులు  పర్గల్‌లోని ఆర్మీ క్యాంపు కంచెను దాటడానికి ప్రయత్నించారు. సైనికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్  చెప్పారు. దర్హాల్ పోలీస్ స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్మీ క్యాంపుకు అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు.16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ దర్హాల్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ  దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.