న్యూఢిల్లీ: 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఘోర తప్పిదం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడి వెనుకున్న అసాంఘిక శక్తులకు కచ్చితంగా తగిన శిక్ష పడుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో కేబినెట్ కమిటీ సమావేశమైంది. అవంతిపుర ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా వ్యవహారాలపై చర్చించిన కేబినెట్ కమిటీ ఇకపై పాకిస్తాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిందిగా నిర్ణయం తీసుకుంది.