పూల్వామా దాడి నేపథ్యంలో భారత ఇంటెలీజెన్సీ మరింత అప్రమత్తమైంది.ఉగ్రమూలకు కదలికపై డేగ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో ఉగ్రమూల కుట్ర రహస్యాన్ని చేధించింది. మొత్తం మూడు మానవ బాంబులకు ప్లాన్ చేసిన జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్ధ..పుల్వావో దాడి చేసి 40 మంది సైనికులను పొట్టనపెట్టుకుంది. ఇప్పుడు మరో రెండు మానవ బాంబులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్సీకి సమాచారం అందింది. అయితే ఈ దాడులు కశ్మీర్ లోపల లేక బయట అనేది ఇంకా తెలియరాలేదు. 


 ఇంటెలిజెన్సీ వర్గాలు తాజా కుట్రకు సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వానికి తెలియజేసి అప్రమత్తం చేశారు. కాగాఇంటెలిజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఉగ్రవాదులను దాడులకు తిప్పికొట్టేందుకు అన్నిరకాలు చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ ... ప్రతి అణుఅణువుగాలిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తుంది..ఉగ్రవాదులను దాడులను సమర్ధవంతంగా  తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్దంగా ఉంది.