ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం - అమిత్ షాతో థాక్రే
సంపర్క్ ఫర్ సమర్థన్ యాత్రలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా గురువారం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనూ దృష్టిలో పెట్టుకుని ఠాక్రేతో షా భేటీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అమిత్ షా ప్రతిపాదలన్నింటిని థాక్రే తిరస్కరించారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించామని అమిత్ షాకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అమిత్ షా కోరగా తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని థాక్రే మరో స్పష్టం చేశారు. ఈ భేటీలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కూడా పాల్గొ్న్నారు.
మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాలకూ గానూ గత ఎన్నికల్లో భాజపా 23, శివసేన 18 దక్కించుకున్నాయి. ఆ తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయి. కేబినెట్ పదవుల విషయంలో తమకు సరైన ప్రాధాన్యత లేదని భావించిన శివసేన బీజేపీకి దూరంగా జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవల పాల్ఘడ్ లోక్‌సభ స్థానంలో శివసేన ఓటమి పాలవడం.. అందుకు కారణం బీజేపీయే అని శివసేన బలంగా నమ్ముతుంది. ఈ కారణం చేత శివసేన - బీజేపీ సంబంధాలు మరింత క్షీణించాయి.