Bride Groom Pushups Video:  నేటి సమాజంలో సోషల్‌ మీడియా అన్నింట కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సోషల్‌ మీడియా ద్వారా సమాజంలో జరిగే అన్ని అంశాలు, విషయాలను నెటిజన్లు తెలికగా తెలుసుకోగలుగుతున్నారు. సమాజంలో జరిగే చెడు, మంచి విషయాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారమవుతున్నాయి. ఈ మధ్య నెట్టింట పలు పెళ్లి వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అయితే పెళ్లికి సంబంధించిన బారత్ (డాన్స్‌ సందడులు) వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటివల కాలంలో వరుడు, వధువులు పెళ్లి మండపంలో చేసే సందడి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోలు అప్‌లోడ్ చేసిన నిమిషాలకే మిలియన్స్‌ వ్యూస్‌కి వెళ్లి పోతున్నాయి.  ప్రస్తుతం ఓ పెళ్లిలో వధువు, వరుడు  చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


పెళ్లి వేడుకల్లో వధువు, వరుడు సరదాగా ఓ చిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే ఛాలెంజ్ ఏమిటో చూస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.  ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే పోటపోటిగా పుషప్స్ ను తీయాడం. అయితే ఈ పోటీలో వధువు, వరుడితో సమానంగా పోటపోటీగా పుషప్స్ తీస్తూ ఉంటారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 



ఈ వైరల్‌ అవుతున్న వీడియోల్లో వేదికపై వధూవరులు పోటాపోటిగా పుషప్స్ తీస్తూ ఉంటారు. అయితే సాధరణంగా అబ్బాయిలు  ప్రతి రోజూ వ్యాయామంలో భాగంగా పుషప్స్ తీస్తూ ఉంటారు. అమ్మాయిల విషయానికి వస్తే వారు పుషప్స్ తీయాడం అరుదు. అయితే ఈ పెళ్లిలో వేదికపై పెళ్లికూతురు తీసీన పుషప్స్‌ను చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఆమె పుషప్స్‌ కొడుతుంటే అందరు కేవ్వుమని కేకలు కూడా వేశారు.  ఈ ఛాలెంజ్‌తో పెళ్లి మరింత సందడిగా మారింది.  వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించడంతో చాలా ఆకర్షనీయంగా కనపిస్తారు. వీరిద్దరిలో ఎవరు గెలిచారన్న విషయం తెలియదు. కానీ ఎవరు గెలిచిన ఈ వీడియో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.  వీడియో bridal_lehenga_designn అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వైరల్‌ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.


Also Read: Goa Special Permit: గోవా వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు!


Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో...జై జగన్‌ అంటూ నినాదాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.