Subash Chandra Nomination: జీ మీడియా వ్యవస్థాపకులు, ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజస్థాన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్‌ పేపర్లను సమర్పించారు. మాజీ మంత్రులు నర్పత్ సింగ్ రాజ్వీ, వాసుదేవ్ దేవ్నాని, చంద్రకాంత మేఘవాల్ సహా 10 మందికి పైగా ప్రతిపాదకులు డాక్టర్ సుభాష్‌ చంద్ర నామినేషన్ పేపర్లపై సంతకాలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ముందు ఆయన బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అరుణ్ సింగ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్, మాజీ సీఎం వసుంధర రాజేలతో సమావేశమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్‌ లోని నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ  జూన్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎంపీలైన ఓంప్రకాష్‌ మాతూర్‌, కేజే అల్ఫోన్స్‌, రామ్‌కుమార్‌ వర్మ, హర్షవర్ధన్‌ సింగ్‌ ల పదవీకాలం జూన్‌ 4వ తేదీతో ముగియనుంది. రాజస్థాన్‌ లో మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ఏడుగురు బీజేపీకి చెందినవారే ఉన్నారు. మిగతా ముగ్గురు కూడా  కాంగ్రెస్‌ కు చెందినవారు. వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ దంగి ఉన్నారు. మన్మోహన్‌ పదవీ కాలం మాత్రం ఏప్రిల్‌ 2024తో ముగియనుంది. ఇక మిగతా ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీల పదవీకాలం జూన్‌ 21 2026తో ముగుస్తుంది.


ఇక 200 మంది సభ్యులుగల రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ కు 108మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక స్వతంత్రులు 13 మంది, రాష్ట్రీయ తంత్రీక్‌ పార్టీకి ముగ్గురు, సీపీఎం, భారతీయ ట్రైబల్‌ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు బీజేపీ 22 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆదివారం 18 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు.


రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుకు ముందు డాక్టర్‌ సుభాష్‌ చంద్ర.. జైపూర్‌ లోని మాతా దుంగ్రి గణేశ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్‌ సుభాష్‌ చంద్ర ఎన్నో ఎండ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భారతదేశపు తొలి ప్రైవేట్‌ శాటిలైట్‌ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ను స్థాపించారు. సుభాష్‌ చంద్ర 2016లో హర్యానా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.


Also Read: Credit Card New Rules: జూన్ 1 రేపట్నించి క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు అమలు


Also Read: Maggi Divorce Case: ప్రతిరోజూ మ్యాగీ పెడుతుందని.. భార్యకు విడాకులిచ్చిన భర్త! ట్విస్ట్ ఏంటంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook