Leopard Attack: పోలీసులు, ఫారెస్టు అధికారులపైకి దూకిన చిరుత, అయినా వెనక్కి తగ్గని అధికారులు..!
Leopard Attack: ఒక్కసారిగా చిరుత మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిందా. సరిగ్గా మీరు ఊహించుకున్నట్టే జరిగింది హర్యానాలోని బెహ్రంపూర్ గ్రామంలో. ఇంతకీ చిరుత ఎందుకు దాడి చేసింది మరి దాన్ని ఎలా బంధించారో తెలుసా.
Leopard Attack: ఓ చిరుత పోలీసులు, ఫారెస్టు అధికారులకు చుక్కలు చూపించింది. గ్రామంలో సంచరిస్తున్న దాన్ని బంధించేందుకు వెళ్లిన అధికారులపై అది తిరగబడింది. హర్యానాలోని బెహ్రంపూర్ లో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు సనోలి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. దాన్ని పట్టుకునేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జగదీప్ నేతృత్వంలోని పోలీసులు, ఇద్దరు ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగారు. తలో దిక్కు వెళ్లి చిరుత జాడను గుర్తించే పనిలో పడ్డారు. ఈలోగా ఆ చిరుత ఒక్కసారిగా పోలీసులపై దాడికి దిగింది. ఒక్కసారిగా చిరుత తమపై దాడి చేస్తుండటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చిరుతను కర్రలతో కొట్టారు. అయినప్పటికీ అది మరో వ్యక్తిపైకి దూకింది. ఇలా దాడి చేసుకుంటూ కొద్దిదూరం పారిపోయింది. చివరకు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్టు అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగదీప్ (ఎస్‌హెచ్‌వో) గాయాలపాలయ్యారు.
ఇందుకు సంబంధించిన వీడియోను పానిపట్ ఎస్పీ శశాంక్ కుమార్ సవాన్ పోస్టు చేశారు. చిరుతను బంధించే క్రమంలో పోలీసు, ఫారెస్టు అధికారులు గాయపడ్డారని ట్వీట్ చేశారు. వాళ్ల ధైర్యానికి హ్యాట్సప్ చెప్పారు. మొత్తానికి చిరుతతో పాటు అందరూ క్షేమంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఆ ట్వీట్ ను 21 వేల మంది లైక్ చేశారు. 4445 మంది రీట్వీట్ చేశారు.
Also Read:Rupee All Time Low: రూపాయి పతనం... జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన దేశీ కరెన్సీ...
Also Read:MS Dhoni Bat: అందుకే ఎంఎస్ ధోనీ బ్యాట్ కొరుకుతాడు.. అసలు విషయం చెప్పేసిన అమిత్ మిశ్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook