సిద్ధూ సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు: ఆధారాలతో సహా వ్యవహారాన్ని బయటపెట్టిన జీ న్యూస్
నిజం నిప్పులాంటిది దాని ప్రభావం ఆలస్యంగా బయటికి వచ్చినప్పటికీ.. ఇది మాత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అలాంటి ఓ నిజాన్ని ఈ రోజు జీ న్యూస్ బయటపెట్టింది
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ తరఫున నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రచారం నిర్వహించారు. అల్వర్ జిల్లాలో ఏర్పాటులో చేసిన ఓ కాంగ్రెస్ సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు విపిపించారు. దీన్ని సిద్ధు ఖండించకపోగా చిరునవ్వుచిందించారు. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
పాకిస్తాన్ వెళ్లి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన సిద్ధూ అక్కడ ఆ దేశానికి జై కొట్టి వచ్చారు.... అయితే ఇది భారత దేశమని విషయాన్ని ఆయన మరిచిపోయి ఉంటారు. అందుకే ఆయన భారత్ లో కూడా ఇదే తరహాలో నినాదాలకు ప్రొత్సహించడం దేనికి సంకేతమని జనాలు ప్రశ్నిస్తున్నారు..
ఈ విషయాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ మరియు వారి అనుకూల వార్త సంస్థలు జీ న్యూస్ పై అకారణంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. జీ న్యూస్ లో ప్రసారం చేసిన వీడియో ఫేక్ అంటూ దుష్పప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా జీ న్యూస్ పై ఇదే రకమైన దుష్పప్రచారం నడుస్తోంది. దీన్ని కథనంగా ప్రసారం చేసిందుకు జీన్యూస్ పై చర్యలు తీసుకుంటామని.. పరువునష్టం దావా వేస్తామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సిద్ధు హెచ్చరించారు.
సిద్ధూ సభలో ముమ్మటికి పాకిస్తాన్ నినాదాలు వినిపించాయని జీ న్యూస్ ఆధారాలతో సహా అన్ని చూపించినా సిద్ధు తమపై ఎదురు దాడికి దిగడం ఎంత వరకు సమంజసం.. వారికి అనుకూలంగా రాస్తే సరి లేదంటే నిష్పక్షపాతి అనే ముద్రవేస్తుంటారు..ఎవరెన్ని చెప్పినా సత్యాన్ని బయటపెట్టే విషయంలో జీ న్యూస్ ఏమాత్రం రాజీపడబోదు. తాము ప్రసారం చేసిన వీడియోలకు జీ న్యూస్ కట్టుబడి ఉంది.