Free Vaccination: దేశంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడవ దశలో ప్రవేశించనుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి సైతం వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరి ఏయే రాష్ట్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వ్యాక్సినేషన్ (Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు. ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) భారీగా విజృంభిస్తుండటంతో వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా  విన్పించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central government) మూడవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మే 1వ తేదీ నుంచి చేపట్టబోతోంది. దీని ప్రకారం 18 -45 ఏళ్ల వయస్సు వారికి కూడా వ్యాక్సిన్ వేయనున్నారు. దీనికోసం కోవిన్ యాప్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే ఈ వ్యాక్సినేషన్ ఉచితం కాదు. దాంతో చాలా రాష్ట్రాలు ఉచితంగా మేమే ఇస్తాం అంటూ ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా..18 ఏళ్లు పైబడినవారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.


ఇప్పటివరకూ 19.19 కోట్ల వ్యాక్సిన్‌ను 45 పైబడినవారికి ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు (Vaccination for above 18 years) పైబడినవారికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తుండటంతో కచ్చితంగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ ఉండనుంది. అందుకే కోవిన్ యాప్ (Cowin app) ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఉన్నాయి.


వ్యాక్సిన్ ఉచితంగా ( Free vaccination) అందిస్తామని ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, ఒడిశా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.


Also read: Karnataka Lockdown: కర్నాటకలో కరోనా ఉధృతి, రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook