నాల్గో విడత పోలింగ్: బరిలో ఉన్న ప్రముఖులు వీరే
![నాల్గో విడత పోలింగ్: బరిలో ఉన్న ప్రముఖులు వీరే నాల్గో విడత పోలింగ్: బరిలో ఉన్న ప్రముఖులు వీరే](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2019/04/29/178176-election-2019.jpg?itok=mPuTlcw5)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడతలో పలవురు ప్రముఖలు బరిలో ఉన్నారు
నాల్గో విడతలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్‌ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో తో పాటు బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోంద్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతోపాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్, మూన్‌మూన్ సేన్ తదితర ప్రముఖులు నాలుగో దశలో పోటీపడుతున్నారు.
ఉప పోరులో ముఖ్యమంత్రి కమల్ నాథ్..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్- ఛింద్‌వాడా శాసనసభ (ఉపఎన్నిక) స్థానానికి, ఆయన తనయుడు నకుల్‌నాథ్.. ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఛింద్‌వాడా ఎంపీగా ఉన్న కమల్ నాథ్ ను అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందున ఆయన తన కుమారుడు రాజీనామా చేసిన స్థానంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధిగా కమల్‌నాథ్ ఉప పోరులో తలపడుతున్నారు . ఇదిలా ఉండగా కమల్ నాథ్ ఎంపీగా 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తనయుడు నకుల్‌నాథ్ బరిలో ఉండడం విశేషం.