COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చాలా అంశాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచి రూల్స్ అన్నీ మారుతున్నాయి. అవేంటో తెలుసుకుందామా..


డిసెంబర్ 1 వ తేదీ. ఇవాళ్టి నుంచి మనం రోజూవారీ ఉపయోగించేవాటికి సంబంధించి  మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం విత్ డ్రాయెల్స్ నుంచి గ్యాస్ సిలిండర్ ధర వరకూ అన్నింటిలో నిబంధనలు మారుతున్నాయి.


అసలు ఇవాళ్టి నుంచి ఏ రూల్స్ ( New Rules ) మారుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఆ నిబంధనలేంటనేది చూద్దాం. ఏయే అంశాల్లో మార్పులు వస్తున్నాయో చూద్దాం.


  1.  గ్యాస్ సిలిండర్ ధర ( Gas Cyliner price ) లో మార్పులు రావచ్చనే వార్తలు వస్తున్నాయి. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరల్ని సవరిస్తుంటాయి. ప్రతి నెలా ఒకటవ తేదీన ఈ మార్పులు జరగడం సహజం. కానీ ఈసారికి మార్పులు లేవని..అదే ధర కొనసాగుతుందని ప్రకటన వెలువడింది.

  2. ఇన్సూరెన్స్ పాలసీ ( Insurance policy ) తీసుకునే వారికి కూడా ప్రయోజనం కలగనుంది. భీమా తీసుకున్న 5 ఏళ్ల తర్వాత పాలసీదారులు అవసరమనుకుంటే ప్రీమియం మొత్తాన్ని 50 శాతానికి తగ్గించుకోవచ్చు. అంటే సగం ప్రీమియం తోనే పాలసీని కొనసాగించుకోవచ్చు.

  3.  రైల్వే శాఖ ( Indian railways ) నడుపుతున్న రైళ్లలో మార్పులు రానున్నాయి. ఇవాళ్టి నుంచి ఇండియన్ రైల్వేస్ మరిన్ని ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. డిసెంబర్ 1 నుంచి పలు కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది.

  4. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB ATM Rules ) అయితే ఏటీఎం నిబంధనల్ని మార్చింది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలనుకునేవాళ్లు..ఇకపై మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లాలి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకోగలరు. ప్రస్తుతానికి ఈ విధానాన్ని పదివేల రూపాయలకు పైబడిన లావాదేవీలకు వర్తింపజేస్తున్నారు. 

  5. ఆర్బీఐ ( RBI ) కొత్త నిబంధనలు అమల్లో వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల్లో ఇవాళ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మనీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన మార్పులు. ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సేవలు ఇకపై 365 రోజులు అందుబాటులో ఉండనుంది.


Also read: UGC NET Results 2020: యూజీసీ నెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి