జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్; మహానటి నోట మాటల్లేవ్ !!
జాతీయ ఉత్తమగా నటి గా కీర్తి సురేష్ పేరు అనౌన్స్ మెంట్ రాగానే ఆ బ్యూటీ ఆనందానికి అవధుల్లేవు... సంతోషంతో ఉబ్బి తబ్బిబైపోతోంది. మీడియా కంటపడి ఎలా ఫీలౌతున్నారని అడిగితే..తనకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు చెబుతోంది. మళ్లీ మళ్లీ అడిగితే ‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్లు స్వప్న, ప్రియాంక, అశ్వనీదత్ చిత్ర యూనిట్ తో పాటు అవార్డు ఎంపిక చేసిన జ్యూరి సభ్యులు.. అందరికీ ‘నా పెద్ద పెద్ద థ్యాంక్స్’అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ అవార్డు తనకు వరిస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. దీన్ని తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్న కీర్తీ...ఈ అవార్డును తన అమ్మకు అంకితం చేస్తున్నానని తెలిపింది