మహిళలలో స్ఫూర్తిని నింపి వారిని ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు.. అలాగే వారి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై సరైన అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'నారి' పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించింది. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి మేనక గాంధీ ఈ వెబ్ సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ మంత్రిత్వ శాఖలు మహిళల కోసం అమలు చేస్తున్న 350 పథకాల వివరాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. మహిళ, శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సైట్ నడవడం విశేషం. మహిళల భద్రత, ఆరోగ్యం, శిశు వికాసం, విద్య, స్వయం ఉపాధి, హౌసింగ్, సామాజిక భద్రత, రుణాల మంజూరు, న్యాయ సలహాలు ఇత్యాది అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. www.nari.nic.in ద్వారా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.