తూత్తుకూడిలో ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో తమిళనాడు పొల్యూషన్ బోర్డు సూచనల మేరకు గురువారం స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీకి విద్యుత్ సేవలు నిలిపివేశారు. అలాగే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను కూడా సస్పెండ్ చేశారు. నిన్న స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు అన్నానగర్‌లో ధర్నాలు చేస్తుండగా చెలరేగిన హింసలో ఒకరు చనిపోగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే మంగళవారం ఆందోళనకారుల్లో 11 మంది చనిపోగా.. 65 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆందళోనకారులు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతాదళాలు అప్రమత్తమై వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా.. అందులో కొందరు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు లాఠీఛార్జి చేసి జనాలను చెదరగొట్టారు. తర్వాత ఆందోళనకారులపై టీర్ గ్యాస్ వదిలారు. 


నిన్ని రాత్రి స్టెరిలైట్ పోరాటానికి సంబంధించి డీఎంకే పార్టీ ఓ  ప్రకటనను విడుదల చేసింది. మే 25 తేదిన తమ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు వ్యవహరించిన తీరుకి వ్యతిరేకంగా తాము పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించింది. పర్యావరణ అనుమతులు లేని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని తెలిపింది.