ముస్లిం యువకుడితో యువతి స్నేహం.. నరకం చూపించిన పోలీసుల సస్పెన్షన్
ముస్లిం యువకుడితో యువతి స్నేహం.. నరకం చూపించిన పోలీసుల సస్పెన్షన్
హిందూ యువతివి అయి ఉండి, మరో ముస్లిం యువకుడితో స్నేహం చేస్తావా అంటూ మీరట్ పోలీసులు రెచ్చిపోయారు. ముస్లిం యువకుడితో ఎందుకు స్నేహం చేశావని దూషిస్తూ ఓ యువతిని వాహనంలో తిప్పుతూ హింసించారు. బాధితురాలిపై దుర్భాషలాడటమే కాకుండా ఆమెపై చేయి కూడా చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అవడంతో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. సస్పెండ్ అయిన వారిలో యువతిని వేధించిన ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే. ఈ వీడియో ఆధారంగానే పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీచేశారు.