Encounter in Jammu and Kashmir's Pulwama: జమ్ముూకాశ్మీర్​లో ఉగ్రవాదుల (militants) ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో (Pulwama District) బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో (encounter) ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు (Jaish-e-Mohammad) హతమయ్యారు. సంఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామగ్రి, రెండు ఎం-4 కార్బెన్స్​, ఒక ఏకే సీరీస్​ రైఫిల్​ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుల్వామా జిల్లాలోని చండ్గామ్​ గ్రామంలో (Chandgam Village) ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం భద్రతాబలగాలకు అందింది. ఈ క్రమంలో నక్కి ఉన్న ముష్కరులు..జవాన్లుపైకి కాల్పులు జరిపారు. ఇది కాస్తా ఎన్ కౌంటర్ కు దారితీసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. హతమైన వారిలో పాకిస్థాన్​కు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరికి జైషే మొహమ్మద్​ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఇది గొప్ప విజయంగా వారు పేర్కొన్నారు. 




Also Read: Corona Third Wave: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం ఆ నగరాలేనా..??


ఇటీవల జమ్మూకశ్మీర్​ హర్వాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎల్​ఈటీ టాప్​ కమాండర్​​ సలీమ్​ను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. మరో ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడిని బలగాలు హతమర్చాయి. పాక్​ నుంచి దేశంలోకి ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాను బీఎస్​ఎఫ్​ జవాన్లు (BSF Jawan's) అడ్డుకున్నారు.ఆర్నియా సెక్టర్​లో.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అప్రమత్తంగా ఉన్న జవాన్లు.. సోమవారం ఉదయం వేళ అనుమానాస్పద రీతిలో ఉన్న బ్యాగును గుర్తించారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకున్నారు. అందులో 3 ఏకే 47 తుపాకులు, 4 పిస్టళ్లు, వివిధ రకాల బులెట్లతో పాటు 5 ప్యాకెట్ల హెరాయిన్​ ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి