న్యూడిల్లీ: 2012 లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ముగ్గురు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో ముఖేష్ సింగ్ తప్ప మీఫీల ముగ్గురు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలు ఐసీజేను ఆశ్రయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: కరోనా కట్టడికి మరో కఠిన నిర్ణయం తీసుకున్న కేంద్రం


డిసెంబర్ 16, 2012 న, ప్రయాణిస్తున్న బస్సులో నిర్భయ అనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య గావించబడింది. ఈ ఉదంతానికి సంబంధించిన మొత్తం ఆరుగురు కాగా వారిలో ఒకరైన రామ్ సింగ్ డిల్లీలోని తీహార్ జైలులో గతంలో ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు జైలు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ఆరవ వ్యక్తి అయిన బాలనేరస్తుడు 18 ఏళ్ళకు తక్కువ వయస్సున్నాడని జువైనైల్ చట్ట ప్రకారం విడుదల చేశామని అధికారులు తెలియజేశారు.  


Also Read: బంగారంపై కరోనా భారం..


నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తాజా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల 30 నిముషాలకు ఉరి శిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. 


Read Also: Rs 2,000 notes printing: రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేశారా ? స్పందించిన కేంద్రం


నలుగురు దోషుల మెర్సీ పిటిషన్లను పలుమార్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. కాగా రాష్ట్రపతి తిరస్కరించిన తీరు న్యాయబద్దం కాదని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొంటూ తాము అత్యున్నత న్యాయస్థానంలో పోరాడుతామని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..