COrona Effect: ఆ కారణంతోనే 3000 మంది ఖైదీల విడుదల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ మహమ్మారి సంక్రమణకు గురికాకుండా 3000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో ఒకవేళ వైరస్ విజృంభిస్తే ఖైదీలందరికీ వైరస్ సోకే అవకాశం ఉండడంతో
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ మహమ్మారి సంక్రమణకు గురికాకుండా 3000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో ఒకవేళ వైరస్ విజృంభిస్తే ఖైదీలందరికీ వైరస్ సోకే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తీహార్ జైలు అధికారులు తెలిపారు. సుప్రీం కోర్టు అదేశాల ప్రకారం ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీలను పెరోల్‌పై నాలుగు నుంచి ఆరు వారాల పాటు విడుదల చేస్తామని జైళ్లశాఖ డైరెక్టర్ సందీప్ గోయల్ తెలిపారు. కాగా విడుదల చేయబోతోన్న ఖైదీలలో తీవ్రంగా నేరాలు చేసిన వారు, పెద్ద నేరాలకు పాల్పడినవారున్నారని పేర్కొన్నారు. మరోవైపు అండర్ ట్రయల్ నేరస్తులను మద్యంతర బెయిల్‌పై మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.
Also Read: కేసీఆర్‌కు చెక్ అందించిన హీరో నితిన్
ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా 519 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, Telanganaలో మరో మూడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36కి చేరిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటీవ్ వచ్చినట్లు తెలిపగా, ముగ్గురిని విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటీవ్ వచ్చిందని, లండన్ నుంచి వచ్చిన హైదరాబాద్ చెందిన 49 ఏళ్ల వ్యక్తి, సౌదీ నుంచి వచ్చిన కోకా పేట చెందిన 61 ఏళ్ల మహిళ, జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటీవ్ వచ్చిందని, ముగ్గురిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారికంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం