నిర్భయ కేసులో దోషులకు తీహార్ జైలు ఆఫర్..!! 
చివరి కోరిక తీర్చుకోవాలని లేఖ.. !!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్భయ కేసులో దోషులు ఎలా ఉన్నారు..? చివరి రోజుల్లో వారి మానసిక పరిస్థితి ఏంటి..? తీహార్ జైలులో వారి చివరి కొరికలు నెరవేరుతాయా..?  నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. మార్చి   3 న వారికి ఉరి శిక్షలు అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోజులు కూడా దగ్గరపడుతున్నాయి.  ఈ క్రమంలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే..! 


తీహార్ జైలు అధికారులు.. నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకున్న సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు తీర్పులను అనుసరించి ముందుకు వెళ్తున్నారు. ఈ కేసులో దోషిగా ఉన్న  వినయ్ శర్మ మానసిక వైద్యం అందించాలని కోర్టును ఆశ్రయించాడు. అలాగే మరో దోషి.. గతంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు .. దాన్ని తిరస్కరించాలని హోం మంత్రి సూచించారని.. కానీ అప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. హోం మంత్రి సంతకాన్ని పరిగణలోకి  తీసుకోవద్దని కోర్టును ఆశ్రయించాడు. ఇలాంటి పిటిషన్లతో ఉరి శిక్షను వీలైనంత వరకు జాప్యం చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి పిటిషన్ల సంగతి ఎలా ఉన్నా.. తీహార్ జైలు అధికారులు మాత్రం తన పనుల్లో తాము నిమగ్నమై ఉన్నారు. తాజాగా నిర్భయ కేసులో నలుగురు దోషులకు వారు లేఖలు రాశారు.  


 ఉరి శిక్ష అమలుకు ముందు .. చివరిసారిగా వారికి ఆఫర్ ఇచ్చారు. వారంతా తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని లేఖలో సూచించారు. కానీ వారి ఆఫర్ ను నలుగురు దోషులు నిరాకరించారు. నిర్భయ కేసులో దోషులుగా ఉన్న అక్షయ్, వినయ్ శర్మ .. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇష్టపడలేదు. అలాగే మరో ఇద్దరు ముఖేష్, పవన్ .. తాము ఇప్పటికే కుటుంబ సభ్యులను కలుసుకున్నామని .. మళ్లీ కలుసుకోబోమని చెప్పారు.  


మరోవైపు తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ జైళ్ల పరిపాలన శాఖకు ఓ లేఖ రాశారు. మార్చి 3 కంటే రెండు రోజుల ముందుగానే తలారిని పంపించాలని కోరారు.


Read Also : కన్నుకొట్టిన కేరళ కుట్టి మళ్లీ ఏం చేసిందో తెలుసా.. ?