న్యూ ఢిల్లీ: అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ తీర్పును ఒకరికి విజయంగానో లేక మరొకరికి ఓటమిగానో చూడొద్దని అన్నారు. అంతేకాకుండా రామ్, రహీం భక్తులకు ఇది దేశంపై భక్తిని చాటుకునే తరుణం అని అభిప్రాయపడ్డారు. రామ్ భక్తులకు అయినా.. రహీం భక్తులకు అయినా.. ఇది దేశభక్తిని పెంపొందించుకునే సమయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పంజాబ్ లోని గుర్దాస్‌పూర్‌ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి నుంచే సుప్రీం కోర్టు తీర్పుపై ట్విటర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.