Opinion Poll: మోడీ గ్రాఫ్ తగ్గిందా? బీజేపీ హ్యాట్రిక్ కష్టమేనా? కేసీఆర్ పీఎం రేసులో ఉంటారా? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..
Opinion Poll: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా దేశంలో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది.అధికార ఎన్జీఏతో పాటు యూపీఏ దూకుడు పెంచింది.బీజేపీ తిరిగి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు చెబుతుండగా.. ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు
Opinion Poll: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా దేశంలో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార ఎన్జీఏతో పాటు యూపీఏ దూకుడు పెంచింది. ప్రాంతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయి. మూడో కూటమి వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ తిరిగి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు చెబుతుండగా.. ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు. గతంలో కంటే యూపీఏ బలం పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీరోల్ పోషించబోతున్నాయనే ప్రచారం సాగుతోంది. దేశంలో పొలిటికల్ హీట్ పెరగడంతో జనం నాడి పట్టేందుకు పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ ఎగ్టిల్ పోల్స్ ఫలితాలు వచ్చాయి.
జాతీయ స్థాయిలో నిర్వహించిన టైమ్స్ నౌ ఓపీనియన్ పోల్ లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కారే వస్తుందని సర్వేలో తేలింది. దేశంలో మొత్తం 543 స్థానాలు ఉండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 292 నుంచి 312 స్థానాలు వస్తాయని తేలింది. గతంలో కంటే ఎన్డీఏకు కొన్ని సీట్లు తగ్గనున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 118-138 సీట్లకే పరిమితం అవుతుందని టైమ్స్ నౌ సర్వేలో స్పష్టమైంది. యూపీఏ కంటే 2019 కంటే కొన్ని సీట్లు పెరగనున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో బెంగాల్ లో టీఎంసీకి 27 నుంచి ౩1, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 17 నుంచి 23, ఆమ్ ఆద్మీ పార్టీకి 8 నుంచి 12, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు 6 నుంచి 10 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇతరులు 40 నుంచి 50 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.
2024లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన పోటీ ఎవరనే విషయంపైనా పోల్ నిర్వహించగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 22 శాతం ఓట్లతో ముందు నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ 19శాతం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 13శాతం ఓట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోల్ లో ప్రియాంకా గాంధీ 11 శాతం ఓట్లు రాగా... ఇటీవల కాలంలో దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేవలం 4 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 31 శాతంగా ఉన్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ప్రచారం చేస్తున్న గులాబీ నేతలకు టైమ్స్ నౌ ఫలితాలు షాకింగ్ గా మారాయి.
Read Also: Munugode: బ్రేకింగ్.. మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎంపీపీ సహా కీలక నేతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook