Kolkata doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశంలో అందరిని కన్నీళ్లు పెట్టించేదిగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ ఘటనపై దేశప్రధాని నుంచి  రాష్ట్రపతి వరకు ప్రతిఒక్కరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు సైతం.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి కేసు విచారణ చేపట్టింది. ఈ కేసుపట్ల సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 8 న జరిగిన ఈ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా,దీనిలో ఉన్న నిందితుల్ని కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు మమతా సర్కారు పట్ల ప్రజలు తీవ్రంగా అసహానంతో ఉన్నారు. ఆమె చర్యల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇప్పటికే మమతా.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం ... దీదీ తీరును తప్పుపట్టారు.ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఏకంగా సొంత పార్టీకి చెందిన ఒక ఎంపీ మమతా తీరు పట్ల ఘాటుగా విమర్శిస్తు ఎక్స్ లో లేఖను రాశారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన దేశంలో అందరిని కలిచివేసింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ..  అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత జవహర్ సిర్కార్.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా..  ఈ మేరకు పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఘాటుగా లేఖను రాశారు.  


కోల్ కతా ఘటన తర్వాత మమతా  ప్రవర్తించిన తీరు అంతగా ఆమోద యోగ్యంగా లేదన్నారు. ముఖ్యంగా.. విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా.. ఆమె అణచివేతలకు పాల్పడ్డారన్నారు. విద్యార్థులపై భాష్పవాయులు, వాటర్ కెన్ లలో దాడులు చేయడం ఘోరమన్నారు. గత కొన్ని నెలలుగా.. సీఎం మమతా బెనర్జీతో భేటీ అయి మాట్లాడేందుకు  ప్రయత్నిస్తున్నా.. అవకాశమే ఇవ్వడం లేదని జవహర్ సిర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన పలువురు ఉన్నతాధికారులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వైద్యురాలిపై హత్యాచారం అనంతరం రాష్ట్రంలో జరిగిన ఆందోళనలతో.. ఈ ప్రభుత్వ వెనుక ప్రజలు లేరనే విషయం స్పష్టమైందని చెప్పారు. ఈ హత్యాచార ఘటన అనంతరం మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమని ఎంపీ జవహార్ సిర్కార్ విమర్శించారు.


Read more:Ganesh Chaturthi 2024: వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకొవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..



తాను ఎంపీగా ఉన్న ఈ మూడేళ్లలో... పెద్దల సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్బంగా జవహర్ సిర్కార్ గుర్తు చేశారు. తన పోరాటమంతా అవినీతితోపాటు.. మతతత్వంపైన కూడా చేశానంటూ ఈ సందర్భంగా జవహర్ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్ జీ కర్ కాలేజీ వైద్యురాలు హత్యాచారం ఘటన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించిన తీరుతో పాటు.. ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.