తొలిసారి రూ.49 వేల మార్క్ చేరిన బంగారం
బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం ధరలు భారీగా తగ్గగా, నేడు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. ఎట్టకేకలకు బంగారం ధర రూ.49 వేల మార్కును చేరుకుంది. వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి.
బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం ధరలు భారీగా తగ్గగా, నేడు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. ఎట్టకేకలకు బంగారం ధర రూ.49 వేల మార్కును చేరుకుంది. వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.650 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,050కి ఎగసింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.120 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.45,240కి పతనమైంది. ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే రైళ్లు ఇవే..
ఢిల్లీ మార్కెట్‌లోనూ నేడు బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. నిన్న బంగారం ధర రూ.960 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కి క్షీణించింది. నేడు అదే ధర వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 వద్ద నిన్న ధరతోనే కొనసాగుతోంది. విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
బులియన్ మార్కెట్‌లో ఓ వైపు బంగారం రూ.49 వేల రికార్డు ధర నమోదుచేయగా.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. నిన్న రూ.1340 మేర భారీగా పెరిగిన వెండి ధర నేటి మార్కెట్‌లో రూ.800 మేర పతనమైంది. దీంతో 1 కేజీ వెండి ధర ధర రూ.49,200కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్