Gold Rate: బంగారం ధర పెరిగింది, వెండి తగ్గింది
Today Gold Rate | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి దరలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధర నేడు మరోసారి పెరగగా, వెండి మాత్రం ధర తగ్గింది. ఆల్టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన మరుసటి రోజు వెండి ధర దిగొచ్చింది.
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold rate Today) నేడు పెరిగాయి. అందుకు భిన్నంగా వెండి ధర తగ్గింది. నేడు హైదరాబాద్ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.180 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,470కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.50 పెరగడంతో ధర రూ.47,180 అయింది. భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యముంది
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా.. ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,950గా ఉంది. సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం దిగొచ్చింది. మార్కెట్‌లో వెండి ధర నిన్న రూ.880 మేర భారీగా పెరిగగా.. నేడు రూ.200 మేర తగ్గింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.52,800 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి కేజీ ధర రూ.53వేల మార్క్ చేరగా.. ఆ మరుసటి రోజే ధర తగ్గింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..