బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.570 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,640కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.49,170కి పడిపోయింది. Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi)  నాలుగోరోజుల తర్వాత తగ్గాయి. తాజాగా రూ.400 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,600కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,000కి క్షీణించింది. Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) ఐదు రోజుల తర్వాత దిగొస్తుంది. నిన్న రూ.1500 తగ్గిన వెండి ధర తాజాగా రూ.1400 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.65,800కి పతనమైంది. వెండి దేశ వ్యాప్తంగా ఇదే ధర ఉంటుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.3000 మేర వెండి ధర తగ్గడం గమనార్హం. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్