Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్‌ కొనసాగుతుండగా తొలిసారి బంగారం ధరలు తగ్గాయి. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి సైతం బంగారాన్ని అనుసరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 carat Gold Silver price in Andhra Pradesh


హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,925 రూపాయలు తగ్గింది.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,375 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.1,942 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల ధర మరోసారి నలభైవేల కిందకి దిగింది. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.39,828కి క్షీణించింది. లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,710కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,150 తగ్గింద. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,410కి జంప్ అయింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


కాగా, వెండి సైతం పసిడినే అనుసరించింది. నిన్న మార్కెట్లో స్వల్పంగా తగ్గిన వెండి ధర నేడు భారీగా క్షీణించింది. గత 10 రోజుల్లో కనిష్ట ధరకు వెండి దిగొచ్చింది. 1 కేజీ వెండి రూ.1,910 మేర తగ్గడంతో నలభై వేల కిందకి చేరుకుంది. దీంతో 1కేజీ వెండి ధర రూ.39,500 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,500 వద్ద కొనసాగుతోంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ