Rafale In India: రాఫెల్ రాకతో భారత వాయుసేన ( Indian Air Force) బలం రెట్టింపు అయింది. యుద్ధ గతిని మార్చగలిగే సత్తా ఉన్న రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ (Rafale Air Crafts ) ల రాకతో భారత పొరుగున ఉన్న దేశాలు ఇకపై మన భూభాగంపై కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిందే. మొత్తం రూ.59 వేల కోట్లతో 36 రాఫెల్ విమానాలు అందించేలా భారత్ ప్రభుత్వం ప్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తో ( Dassault Aviation ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం భారత్ ముందు రష్యాకు చెందిన సుకోయ్ , అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థలను కూడా పరిశీలించి చివరికి రాఫెల్ ను ఫైనల్ చేశారు.  ( Read Also:  శ్రీ రాపాకా స్వీటి ఘాటు అందాల హాటు ఫోటోలు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Facts About Rafale Aircrafts: టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు


1. మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి. ఇందులో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి.
2. రాఫెల్ లో హ్యామర్ మాడ్యులర్ ( Hammer Moduler ) రాకెట్స్ తో పాటు మరెన్నో రకాల ఆయుధాలను అమర్చవచ్చు. 
3. భూమిపై ఉన్న శత్రు స్థావరాలపై ఖచ్చితంగా గురి చూసి నష్టం కలిగించే సామర్థ్యం రాఫెల్ సొంతం.
4. రాఫెల్ లో అమర్చేందుకు కావాల్సిన హ్యామర్లను అందించేందుకు భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగింది
5. రాఫెల్ ఫైటర్ జెట్స్ లాంగ్ రేంజ్ రాకెట్ ( Long Range Rockets ) అయినా మీటియార ను కూడా తీసుకెళ్లగలదు. శత్రువును గాల్లోనే టార్గెట్ ( Airt- To- Air ) చేసి ఖతం చేస్తుంది. ఇందులో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించకుండా టార్గెట్ ను అంతం చేస్తుంది.


Read This Story Also: Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో


6. రాత్రి పగలు అనే తేడాలు లేకుండా.. పల్లపు భూములు, పర్వత ప్రాంతాలు అని భేధాలు లేకుండా రాఫెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. 
7. రాఫెల్ లో అణ్వాయుధాలు కూడా అమర్చ వచ్చు. 
8. రాఫెల్ విమానాలు విరామం లేకుండా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. గంటలకు 1389 వేగంతో దూసుకెళ్తాయి. 
9.రాఫెల్ విమానాన్ని నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంత మంది పైలట్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణను అందుకున్నారు.
10. దక్షిణ ఆసియాలో రాఫెల్ ఒక గేమ్ ఛేంజర్ . భారత వాయుసే బలం రాఫెల్ రాకతో మరింతగా పెరగనుంది. ముఖ్యంగా కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశాలు ఇక రాఫెల్ రాకతో తోకముడుస్తాయి.


Read Also: #SonuSoodRealHero:అరుంధతి విలన్..రియల్ లైఫ్ హీరో