Top Jaish commander, IED expert among two terrorists killed in Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెర్రిరిస్ట్‌లు, భారత భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కస్‌బయార్‌ కు సమీప ప్రాంతంలో తాజాగా ఉగ్రవాదుల కోసం మన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ క్రమంలో జవాన్లపై, టెర్రిరిస్ట్‌లు కాల్పులు చేపట్టారు. దీంతో వెంటనే భారత జవాన్లు ఎదురు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్‌కౌంటర్‌‌లోమృతి చెందిన వారి వివరాలు కశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. జైషే మహమ్మద్‌ (Jaish-e-Mohammed) టాప్‌ కమాండర్‌ యాసిర్ పర్రే‌తో (Yasir Parray) పాటు ఐఈడీ ఎక్స్‌ పర్ట్‌ (Improvised Explosive Device (IED) expert) అయిన ఫారిన్ టెర్రరిస్ట్ ఫర్క్వాన్‌ గా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. 


అయితే దక్షిణ కశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ (Qasbayar) సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే విషయం ముందుగానే భద్రతా బలగాలకు తెలిసింది. అక్కడున్న టెర్రిరిస్ట్‌ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు భద్రతబలగాలపై కాల్పులు చేపట్టారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ (encounter) ఇంకా కొనసాగుతోంది. కస్‌బయార్‌‌కు చుట్టుపక్కలున్న ప్రాంతాలన్నింటిలో భద్రతబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.


Also Read : Bheemla Nayak - RRR Updates: సిరివెన్నెలకు సంతాపంగా ప్రమోషన్స్ ఆపేసిన ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’


గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో టెర్రిరిస్ట్‌ల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీంతో స్థానిక పోలీసులతో పాటు భారత భద్రతాబలగాలు కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టెర్రరిస్ట్‌లకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం కూడా ఒక ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబా టెర్రిరిస్ట్ సంస్థకు అనుబంధంగా పని చేస్తోన్న ది రెసిస్టెంట్ ఫోర్స్‌కు సంబంధించిన టెర్రరిస్ట్‌లను (terrorists) భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.


Also Read : Scary Snake: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. చిన్న పాము పెద్ద గుడ్డు స్వాహా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook