కరోనా కాటుకు 79 మంది బలి.. 3 రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటికే 30 కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కరోనా బారిన పడ్డాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటికే 30 కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కరోనా బారిన పడ్డాయి. నిన్న ఒక్కరోజే (ఏప్రిల్ 4న) దేశంలో 472 కోవిడ్19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఓవరాల్ కేసుల సంఖ్య 3374కు చేరుకుంది. కరోనా మహమ్మారి దేశంలో ఇప్పటికే 79 మంది ప్రాణాలు బలిగొందని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే ఇది చదవండి
వైద్యశాక జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుంచి దేశంలో 11 కరోనా మరణాలు సంభవించాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉందన్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 24 మంది కరోనా కాటుకు బలయ్యారు. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
తమిళనాడు, మహారాష్ట్ర దాదాపు 500 కరోనా కేసులతో ఉన్నాయి. ఢిల్లీ 450, తెలంగాణ 269, ఆంధ్రప్రదేశ్ 230 కేసులతో సతమతమవుతున్నాయి. మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1, మణిపూర్ 2, గోవా 7 కేసులతో కరోనా ప్రభావానికి దూరంగా ఉంటున్నాయి. మరోవైపు ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా కొనసాగనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
బుల్లితెర భామ టాప్ Bikini Photos
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone