India: 30 వేలు దాటిన కరోనా మరణాలు
అమెరికా తరహాలోనే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (India COVID19 Positive Cases), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేపోతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా తరహాలోనే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (India COVID19 Positive Cases), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేపోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Cases In India) 12,87,945కు చేరింది. అమెరికాలో 40 లక్షలకు చేరిన కరోనా బాధితులు
అదే సమయంలో దేశంలో భారీగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో 740 మంది ప్రాణాంతక కోవిడ్19 వైరస్ బారిన పడి చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 30,601కు చేరింది. మొత్తం కేసులకుగానూ 8,17,209 (8 లక్షల 17 వేల 209) మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులున్నాయి. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?
దేశంలో ఇప్పటివరకూ 1,54,28,170 (1.54 కోట్లు) శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. అందులో జులై 23న ఒక్కరోజే 3 లక్షల 52వేల 801 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్