రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తాజాగా భారతీయ రైల్వే మేక్ మై ట్రిప్ అనే ప్రైవేటు ట్రావెల్ పోర్టల్‌తో జత కట్టింది. మేక్ మై ట్రిప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ రైల్వే.. సదరు ప్రైవేటు సంస్థకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ద్వారా రైలు ప్రయాణానికి సంబంధించిన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలును కల్పించింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే ఇలా చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-> మొదటిగా ఈ ఫోన్ నెంబర్‌ని 7349389104 మీ మైబైల్‌లో సేవ్ చేసుకోండి.
-> తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన రైలు నెంబర్‌ని ఎంటర్ చేయండి.
-> ఆ రైలు నెంబర్ సందేశాన్ని పైన సేవ్ చేసుకున్న వాట్సాప్ నెంబర్‌కి పంపించండి.
-> మీ సందేశం పక్కన రెండు టిక్ మార్క్స్ వచ్చే వరకు వేచిచూడండి (మీరు పంపించిన సందేశం సదరు యూజర్‌కి చేరిందని తెలియడానికి ఇది ఉపయోగపడుతుంది).
-> మీ సందేశం ఆ ఫోన్ నెంబర్‌కి చేరిన తర్వాత కొద్ది క్షణాల్లోనే మీకు మీ రైలు ప్రయాణానికి సంబంధించిన వివరాలతో కూడిన సందేశం వస్తుంది. 


ఉదాహరణకు పై వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకున్న ముంబై, న్యూ ఢిల్లీ మధ్య ప్రయాణించే ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రన్నింగ్ స్టేటస్ వివరాలను ఈ ఫోటోలో గమనించవచ్చు.     


[[{"fid":"171869","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"171863","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]