'కరోనా వైరస్'.. ఎప్పుడు ఎలా సోకుతుందో.. ఎవరూ చెప్పలేని పరిస్థితి. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా .. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ధనిక, పేద, ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. ఇలా తేడా లేకుండా అందరికీ  ఈ వైరస్ సోకుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తల్లి నుంచి బిడ్డకు కరోనా వైరస్ సోకుతుందా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఐతే కరోనా వైరస్ పాజిటివ్ గా ఉన్న తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తి జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ..ICMR తెలిపింది. ఐతే ఇది ఎంత నిష్పత్తిలో వ్యాప్తి చెందుతుందనేది స్పష్టంగా తెలియడం లేదని ఐసీఎంఆర్  తెలిపింది. ప్రసవానికి ముందు గానీ లేదా ప్రసవం సమయంలో గానీ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపింది.  కానీ కరోనా పాజిటివ్ గా ఉన్న తల్లి పాల నుంచి బిడ్డకు ఈ వైరస్ సంక్రమిస్తుందనేందుకు ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లేవని ప్రకటించింది. 


కరోనా వైరస్ పాజిటివ్ గా ఉండి.. గుండె సమస్యలు ఉన్న గర్భిణీలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలిపింది. అటు ఎదిగే పిండంలో కరోనా వైరస్ శారీరక వికల్పాలకు కారణమవుతుందనే దానిపైనా స్పష్టత లేదని వివరించింది. మొత్తంగా అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఉన్న వారికి గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలనే సూచనలు మాత్రం ఇవ్వడం లేదని తెలిపింది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..