Lata Mangeshkar: భారతరత్న గ్రహీత,  లెజండరీ సింగర్ లతా మంగేష్కర్‌ మృతికి (Lata Mangeshkar Death) రాజ్యసభ (Rajya Sabha) నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివి వినిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''‘లతా మంగేష్కర్ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది.  ఆమె మరణంతో ఒక శకానికి ముగింపు పలికినట్లయింది. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు తీర్చలేనిది'' అని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. ఉదయం 11:05 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. లతా మంగేష్కర్ నవంబర్ 1999 నుండి నవంబర్ 2005 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు.


ప్రముఖ గాయని లతా మంగేష్కర్(92)‌ (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గత 29 రోజులుగా కరోనాతో (Covid-19) పోరాడి తుదిశ్వాస విడిచారు. నిన్న సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్క్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook