Mahua Moitra Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజురోజుకూ ముదురుతోంది. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనేది ప్రధాన అభియోగం. అందుకే నైతికంగా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగే హక్కు లేదని ప్యానెల్ కమిటీ స్పష్టం చేసింది. దీనిపై లోక్‌సభ నిర్ణయం తీసుకోనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రిపై అభియోగాలు సంచలనం రేపుతున్నాయి. సీబీఐ ఈ కేసును విచారించనుందని తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి నగదు, ఖరీదైన బహుమతులు తీసుకుని లోక్‌సభలో గౌతమ్ అదానీ, ప్రధాని మోదీకు వ్యతిరేకంగా ప్రశ్నలు సంధించారని, రహస్యంగా ఉండాల్సిన పార్లమెంట్ ఐడీని ఆయనతో షేర్ చేశారని మహువాపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఐడీ షేరింగ్ విషయం మహువా కూడా ఒప్పుకున్నారు. 


ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారడంతో పార్లమెంట్ ప్యానెల్ కమిటీ విచారణ జరిపింది. 500 పేజీల నివేదిక సిద్ధం చేసింది. మహువా చర్యల్ని అత్యంత అభ్యంతరకరంహగా, అనైతికంగా, హేయమైనవిగా, నేరపూరితమైనవిగా పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చింది. తక్షణం ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేసింది. ఎధిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో రాహుల్ సభ్యత్వాన్ని కూడా ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు వెంటనే రద్దు చేశారు. 


మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలకు మొయిత్రి తీవ్రంగా స్పందించారు. సీబీఐ ముందు అదానీ గ్రూప్ 13 వేల కోట్ల బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపి అప్పుడు నా అంశానికి వస్తే బాగుంటుందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 


Also read: Madras High Court: సనాతనంపై ఏం పరిశోధనలు చేశారంటూ స్టాలిన్‌కు ప్రశ్న



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook