త్రిపుర ఎన్నికల ఫలితాల్లో భాజపా కూటమి హవా కొనాసాగుతోంది. 59 స్థానాలకుగాను ఎన్నికలు జరగ్గా.. 32 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది. అధికార లెఫ్ట్ పార్టీలు 27 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడమనేది గమనార్హం. బీజేపీ హవా ఇలాగే కొసాగితే ఆ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించినట్లే. ఎందుకంటే అక్కడ పాతికేళ్లుగా వామపక్ష కూటమి అధికారంలో ఉంది. భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నందున అక్కడ వామపక్ష కూటమి గద్దెదిగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తుండటంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.