మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇక లేరు అని ట్వీట్ చేసి, ఆ తర్వాత చేసిన తప్పు తెలుసుకుని నాలిక కర్చుకున్నారు త్రిపుర గవర్నర్ తథాగత రాయ్. ఓవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి తిరిగి క్షేమంగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతోంటే, మరోవైపు బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న త్రిపుర గవర్నర్ తొందరపడి చేసిన ఈ ట్వీట్ ఆయన్ని వివాదంలోకి నెట్టింది. వాజ్‌పేయి బతికి ఉండగానే చనిపోయారని ఎలా ట్వీట్ చేస్తారంటూ ఘాటైన కామెంట్స్ రావడంతో ఆలస్యంగా తేరుకున్న గవర్నర్ తథాగత రాయ్ తన ట్వీట్‌ని డిలీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"172977","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Tripura Governor Tathagata Roy tweets Vajpayee is dead","field_file_image_title_text[und][0][value]":"వాజ్‌పేయి ఇక లేరని ట్వీట్ చేసిన త్రిపుర గవర్నర్ తథాగత రాయ్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Tripura Governor Tathagata Roy tweets Vajpayee is dead","field_file_image_title_text[und][0][value]":"వాజ్‌పేయి ఇక లేరని ట్వీట్ చేసిన త్రిపుర గవర్నర్ తథాగత రాయ్"}},"link_text":false,"attributes":{"alt":"Tripura Governor Tathagata Roy tweets Vajpayee is dead","title":"వాజ్‌పేయి ఇక లేరని ట్వీట్ చేసిన త్రిపుర గవర్నర్ తథాగత రాయ్","class":"media-element file-default","data-delta":"2"}}]]


తాను చేసిన పొరపాటుకు తనని క్షమించాల్సిందిగా కోరుకుంటూ తథాగత రాయ్ మరో ట్వీట్ చేశారు. ఓ ఆలిండియా ఛానెల్ ప్రసారం చేసిన వార్త చూసి తాను అలా ట్వీట్ చేశానని జరిగిన తప్పిదానికి తథాగత రాయ్ క్షమాపణలు చెప్పుకున్నారు.