ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి
రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది.
మంగళవారం గుజరాత్ లోని భావనగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రాంగోలా సమీపంలో రాజ్కోట్-భావనగర్ రాష్ట్ర రహదారిపై జరిగింది.
గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీంలు వచ్చాయి. కాగా పోలీసుల కథనం మేరకు ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.