రోడ్డు ప్రమాదంలో టీఎస్ఆర్టీసీ బస్సు, లారీ దగ్ధం!

లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.. బస్సు, లారీ రెండూ దగ్ధం!
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండర్‌పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనే ఆగి వున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు లారీకి సైతం వ్యాపించాయి. దీంతో అందరూ చూస్తుండగానే ఆర్టీసీ బస్సు, లారీ దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తుగా అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులోంచి వెంటనే కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను షోలాపూర్ ఆస్పత్రికి తరలించారు.