బుధవారం నాడు సీనియర్ భారతీయ జనతా పార్టీ (బిజేపీ) నాయకుడు, ఎంపీ సుబ్రమణియన్ స్వామి- " ప్రతిష్టాత్మక ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవి దినకరన్ విజయం సాధించవచ్చు" అని  అంచనా వేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదనన్, డిఎంకే అభ్యర్థి ఎన్.మరుదు గణేష్ ఓడిపోతారన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి, డిప్యూటీ సియం పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఈ రేసులో లేదు అని న్యూస్ 18తో అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 "టీటీవి దినకరన్, డిఎంకేల మధ్య ఈ పోటీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. పాలక ఈపీఎస్-ఓపీఎస్ (పళని స్వామి-పన్నీర్ సెల్వం) నేతృత్వంలోని ఏఐఏడిఎంకే  ఈ రేసులో ఉండకపోవచ్చు" అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు."వాళ్లిద్దరూ అనర్హులు. వారికి కార్యకర్తల మద్దతు లేదు.  చాలా మంది టీటీవికి మద్దతునిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అతనే   డిఎంకేకి ప్రధాన పోటీదారు" అని ఆయన చెప్పారు. డిఎంకేను 'హిట్లర్ పార్టీ' గా అభివర్ణిస్తూ.. అవినీతి, నేర ఆకృత్యాల నుండి తమిళ ప్రజలను కాపాడాలన్నారు.  టీటీవి దినకరన్ తమిళ ప్రజలను కాపాడుతారని బిజెపి ఎంపి చెప్పారు. 


జయలలిత మరణించిన తర్వాత ఆర్కే నగర్ కు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 24 న జరగనుంది. ఏప్రిల్ 12న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే భారీ మొత్తంలో డబ్బులను పంపిణీ చేసినట్లు ఆరోపణలు రావడంతో వాయిదా వేసింది ఎన్నికల సంఘం. 


2015లో, ఏఐఏడిఎంకే సిట్టింగ్ ఎంఎల్ఎ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకి మార్గం సుగుమం చేయడానికి రాజీనామా చేశారు. జయ బైపోల్ లో గెలిచారు. 2016లో కూడా జయలలిత  ఇదే  నియోజకవర్గం నుండి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. డిసెంబరు 2016లో ఆమె మరణించిన తరువాత నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది.