Turkey Earthquake News Updtes: టర్కీకి భారత్ సాయం.. అడ్డు చెప్పిన పాకిస్థాన్

Turkey Earthquake News Updates: టర్కీకి ఎదురైన కష్టంలో అండగా నిలిచి తన వంతు సహాయం అందించేందుకు ఎప్పటిలాగే భారత్ ముందుకొచ్చింది. టర్కీ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు భారత్ ఇక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది.
Turkey Earthquake News Updates: మునుపెన్నడూ చూడని, కనివీని ఎరుగని భారీ భూకంపంతో టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. పెద్ద పెద్ద అపార్టుమెంట్స్ పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద నుంచి వెలికి తీస్తున్న శవాల కుప్పలతో అక్కడి పరిసరాల్లో భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. కూలిన ఆ మేడల మధ్యే ఎన్నో బతుకులు ఛిద్రమయ్యాయి. కొన్ని కుటుంబాలకు కుటుంబాలే కూలిన భవనాల్లో శిథిలాల మాటున సజీవ సమాధి కాగా.. అయిన వారితోపాటే సర్వం కోల్పోయి రోడ్డున పడిన ఇంకొంత మంది ఆర్తనాదాలు.. చూసేవారిని కంటతడి పెట్టిస్తున్నాయి.
టర్కీకి ఎదురైన కష్టంలో అండగా నిలిచి తన వంతు సహాయం అందించేందుకు ఎప్పటిలాగే భారత్ ముందుకొచ్చింది. టర్కీ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు భారత్ ఇక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. మెడిసిన్స్, వైద్యుల బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ అనే బోయింగ్ యుద్ధ విమానాన్ని ఉపయోగించింది.
అయితే, సీఎన్ఎన్ - న్యూస్ 18 కథనం ప్రకారం టర్కీలో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయ వస్తు సామాగ్రితో వెళ్తున్న సి-17 యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ తమ గగనతలంపై నుంచి వెళ్లేందుకు అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో సి-17 బోయింగ్ విమానం తమ దార్చి మార్చుకుని చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో పాటు పశ్చిమ దేశాలకు, యురోపియన్ దేశాలకు నేరుగా వెళ్లాలంటే భారత విమానాలు పాకిస్థాన్ గగనతలం ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ పాకిస్థాన్ అడ్డుచెబుతున్న కారణంగా భారత్ పాకిస్థాన్ గగనతలం ఉపయోగించకుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మానవతా దృక్పథంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లే భారత్ విమానాలను పాకిస్థాన్ అడ్డుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఆఫ్గనిస్థాన్ లో తాలిబాన్లు ఆక్రమించుకునే క్రమంలో ఆ దేశానికి అండగా నిలిచేందుకు వెళ్లిన విమానాలతో పాటు కొవిడ్-19 సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ పేరిట చేపట్టిన మిషన్ కింద వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత విమానాలను కూడా పాకిస్థాన్ అడ్డుకుంది. దీంతో ఆ విమానాలు చుట్టూ తిరిగి వెళ్లే క్రమంలో చాలా సమయం, చాలా ఇంధనం వెచ్చించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి : Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. 5 వేలకు పైనే మరణాలు!
ఇది కూడా చదవండి : Earthquake: భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాలేంటో తెలుసా?
ఇది కూడా చదవండి : Turkey Earthquake: టర్కీ సిరియా దేశాల్లో పొంచి ఉన్న మరో పెను ముప్పు, భయంతో వణికిపోతున్న ప్రజలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook