గుజరాత్ ఎన్నికల ఫలితాలు వస్తున్న క్రమంలో.. దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పును ఊహిస్తున్న ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల సైట్లలో మైమ్స్ రూపంలో.. ఫన్నీ కామెంట్ల రూపంలో.. వీడియోల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న క్రమంలో పలు ట్వీట్లు పాఠకులకు ప్రత్యేకం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీన్యూస్ ఫైనల్ ఫైస్లా వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవ్వడం విశేషం. మోదీని, రాహుల్‌ని పరీక్షలు రాసే విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఈ జీటీవి ప్రకటన ట్విట్టర్‌లో బాగా వైరల్ అవుతోంది. 18 డిసెంబరు, 2018 ఉదయం 6 గంటల నుండి ఈ కార్యక్రమం జీటీవిలో ప్రసారమవుతుంది




హ్యుమర్ మినిస్ట్రీ అనే పేరడీ సంస్థ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఓటు మర్చిపోయి కాంగ్రెస్‌కి వేశారని జోక్ చేయడం గమనార్హం.




రవీంద్ర జడేజా పేరడీ అకౌంటులో వైరల్ అవుతున్న ఓ వీడియా ట్విటర్‌లో హల్చల్ చేస్తోంది. ఓ పిల్లాడ్ని తీసుకొచ్చి 'రాహుల్ గాంధీ జిందాబాద్' అని అడిగితే.. తను బీజేపీకి ఓటు వేయమని అరవడంతో ఆ మీటింగులో నవ్వులు విరబూసాయి.




రవీంద్ర జడేజా పేరడీ అకౌంటులో మోదీ ఈవీఎంను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేస్తున్నట్లు చూపిస్తున్న ఫన్నీ ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది. 




భారత్ మంతన్‌లో రాహుల్ గాంధీని చాప్లిన్‌తో, జిమ్ క్యారీతో పోల్చడం విశేషం




ఆదిత్య చౌదరి అకౌంట్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ కుక్కపిల్ల గుజరాత్ ఎన్నికలపై జోస్యం చెప్పడం విశేషం