బెంగళూరు: కర్ణాటకలో క‌రోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. బెంగ‌ళూరు సిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్న ప‌లువురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఏ పోలీసు స్టేష‌న్ల‌లో అయితే క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అయ్యాయో వాటిని మూసివేయాల‌ని బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ భాస్క‌ర్ రావు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో మొత్తం దాదాపుగా ఇప్పటివరకు 20 పోలీసు స్టేష‌న్ల‌ను మూసేసిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. TikTok: భారతీయుల డేటాను టిక్ టాక్ ఎక్కడ దాచింది?


ఈ విపత్కర పరిస్థితుల్లో అత్య‌వ‌స‌ర కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను మూసివేసిన ఠాణాల ప‌రిస‌రాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక శాంతి భద్రతల సమస్యలను ప‌రిష్క‌రిస్తున్నారు. క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన పోలీసు స్టేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేసి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగానే స్టేష‌న్ల‌ను మూసివేసిన‌ట్లు నగర సీపీ తెలిపారు. ట్రాఫిక్, సివిల్ పోలీసుల‌తో పాటు హోంగార్డుల‌కు సేఫ్టి గ్లౌసులు, మాస్కులు, శానిటైజ‌ర్లు అందజేశామని సీపీ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..