నదీ ప్రవాహానికి కుప్పకూలిన రెండు భవనాలు

పశ్చిమ బెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు
పశ్చిమ బెంగాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి నదులు, చెరువులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంకురా ప్రాంతంలోని జున్ బేడియాలో నది కాలువ తీరాన్ని ఆనుకుని ఉన్న నివాసాల్లో ఇదిగో ఇలా ఓ రెండు భవనాలు నదీ ప్రవాహానికి కుప్పకూలిపోయాయి. చూస్తుండగానే క్షణాల్లో నది కాలువలో కూలి, కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తుగా ఈ పరిస్థితిని ముందే గమనించిన అధికారులు ఆయా భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ముందే ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహాయించి, ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. నదిలో కూలిపోయిన ఈ రెండంతస్తుల భవనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.