Breaking News: అప్పుడు కేరళ.. ఇప్పుడు కర్ణాటక.. భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు- థర్డ్ వేవ్ కు సంకేతమా?

Omicron Cases In India: భారత దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటక రాష్ట్రంలోనే నమోదైనట్లు వెల్లడించింది.
Omicron Cases In India: దేశంలో తొలిసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రెండు కేసులు కర్ణాటక రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలియజేసింది.
కర్ణాటకలో ఒమిక్రాన్ సోకిన ఇద్దరు పురుషులకు వరుసగా 46, 66 ఏళ్ల వయసు ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ మహమ్మారి బారిన పడిన ఇద్దరు వ్యక్తులకు గత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నమోదవుతున్న క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం దేశంలో 37 SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం లేబొరేటరీలను ఏర్పాటు చేసింది.
ఒమిక్రాన్ వైరస్.. గతంలోని వైరస్ లతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ తెలిపారు. సుమారు 29 దేశాలల్లో ఈ కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందగా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 373 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ పుట్టుక ఎక్కడ?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్.. మొదటిసారిగా నవంబరు 25న దక్షిణాఫ్రికాలో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఆ దేశంలో ఈ ఏడాది నవంబరు 9న సేకరించిన కరోనా వైరస్ శాంపిల్ ను పరీక్షించగా.. అందులో B.1.1.529 ఇన్ఫెక్షన్ ను శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నవంబరు 26న కనిపెట్టిన ఈ కొత్త వేరియంట్ కు Omicron అనే నామకరణం చేసింది డబ్యూహెచ్ఓ.
గతంలో వచ్చిన వైరస్ వేరియంట్ల కంటే దీని వ్యాప్తి ఐదు రెట్లు ఎక్కువ అని వైరలాజీ నిపుణులు కనుగొన్నారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
Also Read: Nude video case : సోషల్ మీడియాలో మహిళా కార్యకర్త నగ్న వీడియో, సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడి అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook