ఫ్లెక్సీ బ్యానర్ కూలి ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు, విచారణకు ఆదేశించిన రైల్వే
ఫ్లెక్సీ బ్యానర్ కూలి ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు
పూణెలోని శివాజీ నగర్ రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా 9 మంది గాయాలపాలయ్యారు. రైల్వే స్టేషన్‌కి ఆనుకుని ఉన్న ఓ ఫ్లెక్సీ బ్యానర్ కూలి అటువైపుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులపై పడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీ బ్యానర్‌ని కట్ చేసి తొలగించే క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.