Jallikattu 2022: తమిళనాడులో సంక్రాంతి పండగ సందర్భంగా 'జల్లికట్టు' (Jallikattu 2022)  క్రీడను నిర్వహిస్తారు. కొవిడ్ నేపథ్యంలో.. ఈ సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఊహగానాలకు చెక్ పెడుతూ..స్టాలిన్ సర్కారు ఈ పోటీలకు అనుమతినిచ్చింది. అయితే, కొవిడ్‌ (Covid-19) మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని సూచించింది. జల్లికట్టు పోటీలో పాల్గొనే ఆటగాళ్లు,  ప్రేక్షకులు మాత్రం తప్పకుండా రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ (Covid Vaccination) తీసుకుని ఉండాలని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో జల్లికట్టు (Tamilnadu Jallikattu) ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఈ ఆట ప్రధాన ఉద్ధేశ్యం..ఎద్దులను లొంగదీసుకోవడం. పొంగల్ తొలి రోజైన శుక్రవారం అవనియాపురంలో ‘జల్లికట్టు’ తొలి పోటీని నిర్వహించడం గమనార్హం. ఇందులో చాలా ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అవనియాపురంలో జల్లి కట్టుని చూడానికి వచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడిపై ఎద్దు దాడి చేసింది. దీంతో ఆ యువకుడు అక్కడకక్కడే మృతి చెందాడు. 


Also Read: kanuma festival 2022: కనుమ పండుగ విశిష్టత ఏంటి?


 అదే విధంగా, తిరుచ్చి జిల్లాలోని పెరియ సూరియూర్‌లో (Periya Suriyur) తన సొంత ఎద్దును జల్లికట్టు వేదిక వద్దకు తీసుకొస్తుండగా..అదే ఎద్దు యజమాని మీనాక్షి సుందరం(27) ఢీకొట్టంది. అతడితి తీవ్ర రక్తస్రావం కావడంతో తిరుచ్చి మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర జల్లికట్టు పోటీల్లో ఇది రెండో మరణం.  పెరియ సూరియూర్ జల్లికట్టులో ఇప్పటివరకు కనీసం తొమ్మిది మంది గాయపడి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వేలూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఎద్దు తాడు యువకుడి మెడకు బిగుసుకుంది. దీంతో అతడిని ఎద్దు చాలా దూరం వరకు ఈడ్చుకుని వెళ్ళింది. నిర్వాహకులు ప్రథమ చికిత్స అందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.


మదురైలోని పాలమేడు జల్లికట్టును (Palamedu jallikattu) జనవరి 15వ తేదీ శనివారం ఉదయం మధురై జిల్లా కలెక్టర్ అనీష్ రాజన్ సమక్షంలో తమిళనాడు మంత్రులు పి త్యాగ రాజన్ ,  పి మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. పాలమేడు జల్లికట్టులో 21 ఎద్దులను మచ్చిక చేసిన ఎస్ ప్రభాకరన్ ఉత్తమ టామర్ అవార్డును గెలుచుకోగా, శివగంగ పులియూరు సూరవలి ఎద్దు ఉత్తమ ఎద్దుగా అవార్డును గెలుచుకుంది. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ (MK Stalin) జల్లికట్టు ఉత్సవ విజేతకు కారును స్పాన్సర్ చేశారు. రెండవ బహుమతి విజేతకు డీఎంకే యువజన విభాగం నాయకుడు, ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బైక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 704 ఎద్దులు, 300 మంది టామర్లు పాల్గొన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook