ఎర్రకోట: ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీలోని ఎర్ర కోటకు సమీపంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక వీరి అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన సమాచారం ప్రకారం అరెస్ట్ అయిన ఇద్దరు కాశ్మీర్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ అయిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఐఎస్‌జేకే)కి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు.
గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్‌లో ఉంటూ వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా సమాచారంతో కొంతకాలంగా ఈ ఇద్దరి కదలికలపై కన్నేసిన అనంతరమే చాకచక్యంగా వీళ్లని పట్టుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు విభాగం తెలిపింది.